డాక్టర్లకు, హెల్త్‌ వర్కర్లకు మొత్తం జీతం చెల్లించాలి

డాక్టర్లకు, హెల్త్‌ వర్కర్లకు మొత్తం జీతం చెల్లించాలి
  • ఆదేశించిన సుప్రీం కోర్టు
  • రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రానికి సూచన

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లకు ఫుల్‌ స్యాలరీ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ విధంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. హెల్త్‌ వర్కర్లకు అకామిడేషన్‌ ఇచ్చే విధంగా ఇవ్వాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన బెంచ్‌ ఆదేశించింది. కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లను కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచే విధంగా రూల్స్‌ తీసుకురావాలని దీనికి సంబంధించి అన్ని రూల్స్‌ను గురువారం లోపు అంందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్రాలు ఈ రూల్స్‌ను పాటించకపోతే డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ అండ్‌ సెక్షన్‌ 188 కింద యాక్షన్‌ తీసుకుంటామని చెప్పింది. కొన్నిరాష్ట్రాల్లో డాక్టర్లకు జీతాలు ఇవ్వడం లేదని, ఢిల్లీలో మూడు నెలలుగా జీతాలు లేక డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లు ఆందోళన చేశారని కోర్టు చెప్పింది. దానిపై వెంటనే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. డాక్టర్లు, మెడికల్‌ స్టాఫ్‌ కరోనా యుద్ధంలో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అని , అలాంటి వారిని అసంతృప్తికి గురిచేయడం సరైంది కాదని కోర్టు గతంలో చెప్పింది.