
- హేట్ స్పీచ్ లపై చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీం సీరియస్
- మీ అధికారాలేమిటో మీకైనా తెలుసా?
- అసలు మీరేం చేస్తు న్నారో తెలుస్తోందా?
- పూర్తి వివరాలతో ఈసీ అధికారి హాజరుకావాలని ఆదేశం
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ‘మీ అధికారాలేంటో మీకు తెలుసా, అసలు మీరేం చేస్తున్నారో తెలుసా?’అని నిలదీసింది. కోడ్ ఉల్లంఘన,హేట్ స్పీచ్ లపై చర్యలు తీసుకునేందుకు ఈసీకి ఉన్న అధికారాలేంటో తాము తేల్చుతామని పేర్కొంది. ఈమేరకు అన్ని వివరాలతో ఈసీ తరఫు అధికారి తమఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
అధికారాల్లేవా?
ఎన్నికల్లో మతపరమైన వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈసీని ఆదేశించాలంటూ ఎన్నారై యోగా టీచర్ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ జరిపింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చే సిన యూపీ సీఎం యోగి, బీఎస్పీ చీఫ్ మాయావతిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ‘‘మాయావతి 12వ తేదీలోగా మీకు వివరణఇవ్వాలి. ఇప్పటికీ (15 నా టికి) సమాధానం రాలేదు.ఇలాంటప్పుడు చట్టప్రకారం మీరేం చే యాలి, ఏం చేశారు”అని ని లదీసింది. దీనిపై ఈసీ తరఫు న్యాయవాది అమిత్ శర్మ కోర్టు కు సమాధానమిచ్చారు. హేట్ స్పీ చ్ లకు సంబంధించి కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు లేవని, కేవలం నోటీసులిచ్చి, వివరణ తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపేందుకు, పార్టీ గుర్తింపు రద్దు చేసేందుకు అధికారం లేదని వివరించారు.
సీఈసీ రావాల్సి ఉంటుంది
ఈసీ లాయర్ వివరణపై సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటివరకు ఎవరెవరికి, ఎన్ని నోటీసులు జారీ చేశారో చెప్పండి. అసలు ఈసీకి ఉన్న అధికారాలేమిటన్నది తెలుసా, మీరు సరిగా సమాధానం చెప్పకుంటే .. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే ఇక్కడికి రావాల్సిం దిగా ఆదేశించాల్సి ఉంటుంది..”అని హెచ్చరించారు. ఈ సందర్భంగా యూపీ సీఎం ఆదిత్యనాథ్, బీఎస్పీ చీఫ్ మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘తమకు అధికారాలు లేవని ఎలక్షన్ కమిషన్ చెబుతోంది.కోడ్ ఉల్లంఘించిన వారికి, మతపరమైన వ్యాఖ్యలు చేసినవారికి నోటీసులిస్తుంది. ఆ నోటీసుకు స్పందించకుంటే హెచ్చరిస్తుంది. అసలు ఈ అంశాన్ని మేం తేల్చుతాం . ఈసీ పూర్తి వివరాలతో తమ అధికారిని మంగళవారం ఉదయం మా ఎదుట హాజరుపర్చాల్సిందిగా ఆదేశిస్తున్నాం ..”అని సీజే చెప్పారు.