విడాకులు తీసుకున్నముస్లిం మహిళ భరణం తీసుకోవచ్చు: సుప్రీం కోర్టు

విడాకులు తీసుకున్నముస్లిం మహిళ  భరణం తీసుకోవచ్చు: సుప్రీం కోర్టు

ముస్లిం మహిళల భరణంపై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. విడాకులు పొందిన ముస్లిం మహిళలకు భరణం పొందే హక్కు ఉందని తీర్పు చెప్పింది అత్యున్నత ధర్మాసనం. మతాలకు సంబంధం లేకుండా సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న ఏ మహిళకైనా భరణం తీసుకునే హక్కు ఉందని తెలిపారు జస్టిస్ నాగరత్న, అగస్టిస్ జార్జ్ మసి తో కూడిన బెంచ్. ప్రతి నెలా బాధిత మహిళకు 10వేల రూపాయలు ఇవ్వాలని పిటిషనర్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. 

విడాకులు  తీసుకున్న తన భార్యకు భరణం ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్.  దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు న్యాయస్థానం.. తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించింది.

నిర్వహణ అనేది దాతృత్వం కాదని.. వివాహిత మహిళల హక్కు అని సుప్రీం కోర్టు తెలిపింది. గృహిణి అయిన భార్య మానసికంగా.. తమపై ఆధారపడుతుందనేది  భర్తలకు  తెల్వదా?.  ప్రతీ పరుషుడు  గృహిణి పాత్రను గుర్తించాలని జస్టిస్ నాగరత్న అన్నారు.