
కర్ణాటక ఎమ్మెల్యేల పిటిషన్లన్నిటిపై రేపు వాదనలు వింటామని చెప్పింది సుప్రీంకోర్టు. తమ రాజీనామాలు ఆమోదించాలని.. మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు శనివారం రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినాలని ఎమ్మెల్యేల తరుపు న్యాయవాది ముఖుల్ రోహత్గీ ఇవాళ కోర్టును కోరారు. అయితే.. ఈ పిటిషన్ ను కూడా మెయిన్ పిటిషన్ తో పాటే మంగళవారం రోజు విచారిస్తామని కోర్టు చెప్పింది.