కిలాడీ కుర్రోళ్లు : ఫేక్ కాల్ సెంటర్.. జాబ్స్ ఇస్తామంటూ మోసం

కిలాడీ కుర్రోళ్లు : ఫేక్ కాల్ సెంటర్.. జాబ్స్ ఇస్తామంటూ మోసం

ఆన్ లైన్ వర్క్ ఫ్రం హోం జాబులు ఇస్తామంటూ మోసం చేస్తున్న గుజరాత్ లని సూరత్ కు చెందిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.సూరత్ లోని రింగ్ రోడ్డులోని ఉన్న రాజ్ హన్స్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నా అక్రమ కాల్ సెంటర్ ను సీజ్ చేశారు. వర్క్ ఫ్రం హోం ద్వారా ఇంటి నుంచే డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు  వసూలు చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. 

Quicker marketplace , Gogole Search  వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లను ఉపయోగించి జాబ్ కోసం వెతుకుతున్న వారిని లక్ష్యంగా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఏరో టెక్ సోల్యూషన్స్ పేరుతో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఆఫర్ చేస్తూ దండుకుంటున్నారు. పని పూర్తి చేసినప్పటికీ వారికి డబ్బులు ఇవ్వకుండా ఒప్పందం ప్రకారం వారికి జరిమానా విధిస్తున్నారు. బాధితులను ప్రలోభపెట్టడం , ఒప్పందాలతో వారిని ట్రాప్ చేయడం, కల్పిత పని ఒత్తిడిని సృష్టించడం, చట్టపరమైన చర్యల ముసుగులో డబ్బు దోపిడీ చేస్తున్నారు ఈ మోసాగాళ్లు.

పక్కా సమాచారంతో సూరత్ పోలీసులు కాల్ సెంటర్ పై దాడి చేశారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల విలువైన ఏడు కంప్యూటర్లు, 15 మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అమన్ అక్బర్ గోరీ, సల్మాన్ ఫిరోజ్ పఠాన్, వినోద్ నానాభాయ్ చౌహాన్, తామిర్ మొయియుద్దీన్ గోరీ, అమీర్ హరూన్ హునాని, జునైద్ హుస్పియాన్ పఠాన్, జెబున్నీసా అజర్ షేక్ లుగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.