చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాకులు.. ఐపీఎల్ నుంచి రైనా అవుట్..

చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాకులు.. ఐపీఎల్ నుంచి రైనా అవుట్..

ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రాక్టీస్ కోసం ఇప్పటికే దుబాయ్ చేరిన జట్టులో ఒక బౌలర్ మరియు 10 మంది స్టాఫ్ కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ఆ షాక్ లో ఉన్న జట్టుకు తాజాగా మరో షాక్ తగిలింది. సీనియర్ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పకుంటున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడని.. ఐపీఎల్ 2020 సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడని టీమ్‌ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌ తెలిపారు.

‘సురేశ్‌ రైనా తన వ్యక్తిగత కారణాలతో దుబాయ్ నుంచి భారత్‌కు తిరిగొచ్చేశాడు. అతను ఈ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండడు. ఈ సమయంలో సురేశ్‌ రైనాతో పాటు అతని కుటుంబానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సపోర్ట్ గా నిలుస్తుంది’ అని సీఎస్కే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

రైనా 2008 నుంచి సీఎస్కే జట్టులో ఆడుతున్నాడు. ఆ జట్టుకు అతను వెన్నెముక లాంటివాడు. గత 12 సీజన్లలో రైనా ఎప్పుడూ విఫలమవ్వలేదు. సీఎస్కే కెప్టెన్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన రోజే.. రైనా కూడా రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఇద్దరూ అనుకొనే ఆగష్టు 15న రిటైర్ మెంట్ ప్రకటించారు. రైనా ఇంత సడెన్ గా ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై ఎన్నో సందేహాలు వస్తున్నాయి. కాగా.. ఇప్పటివరకు కారణమైతే తెలియలేదు.

For More News..

క్యాన్సర్ తో ‘బ్లాక్ పాంథర్’ హీరో మృతి

పుల్వామాలో ఎన్‌కౌంట‌ర్.. ఒక జవాను.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి

5.5 కోట్లు పెట్టి కట్టిన్రు.. మెయింటెనెన్స్ మరిచిండ్రు..