
పూజా హెగ్దే టాలీవుడ్లో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. దీనికి కారణం ఆమెపై ఐరన్‌లెగ్ అనే ముద్ర పడిందనే టాక్ నడుస్తోంది. అందుకే ఆఫర్లు రావడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాధేశ్యాం ఈ బ్యూటీకి తెలుగులో ఆఖరి సినిమా. అయితే, ఈ ఇంతలా గ్యాప్ తీసుకోవడానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది.
పూజా కొంతకాలంగా కాలినొప్పి సమస్యతో బాధపడుతోంది. గత రెండు సినిమాల్లోనూ ఇలాగే కంటిన్యూ చేసినా ఇప్పుడది మరింత బాధిస్తోందట. దీంతో ఆమె కాలికి సర్జరీ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కోలుకోగానే తిరిగి బిజీగా మారనుందట.
సర్జరీ వార్త పూజా ఫ్యాన్స్‌ను బాధిస్తున్నా.. ఇప్పటివరకు ఈ బ్యూటీపై జరుగుతున్న ప్రచారమంతా ఉత్తిదేనని తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.