నడుము లోతు నీళ్లు.. చేతిలో కత్తిపీట: సూరి కొత్త మూవీ పోస్టర్ రిలీజ్

నడుము లోతు నీళ్లు.. చేతిలో కత్తిపీట: సూరి కొత్త మూవీ పోస్టర్ రిలీజ్

తమిళ నటుడు సూరి లీడ్ రోల్‌‌‌‌లో  మంగళవారం ఓ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.  ఈ మూవీ అనౌన్స్‌‌‌‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌లో సూరి వెనుక నుంచి కనిపిస్తూ,  మురికిగా ఉన్న వరద నీటిలో నడుము వరకు నిలబడి ఉంటాడు. చేతిలో కత్తిపీటను పట్టుకుని ఉన్న  అతని  నీడ  నీటిలో  కనిపిస్తుండగా, బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో వంట గదిలో చెల్లాచెదురుగా పడివున్న వస్తువులు ఉన్నాయి.  

ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌పై ‘బ్లడ్ ఫాలోవుడ్ ద ఫ్లడ్’ అని రాసుండటం సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఇటీవల కొట్టుక్కాళి,  విడుదలై, మామన్  వంటి సినిమాలతో మంచి ఫామ్‌‌‌‌లో ఉన్న సూరి, ఈ చిత్రంలో ఇంటెన్స్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.  అజిత్‌‌‌‌తో  ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ప్రదీప్ రంగనాథన్‌‌‌‌తో ‘డ్యూడ్’ చిత్రాలను నిర్మించిన మైత్రి  మూవీ మేకర్స్..  తమిళంలో నిర్మిస్తున్న మూడో సినిమా కావడంతో ఆసక్తి  నెలకొంది.  త్వరలో  మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు.