
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సూర్య హీరోగా నటిస్తున్న “కరుప్పు” సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. నేడు (జూలై 23న) సూర్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం.
ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ అంచనాలు పెంచేశాయి. సూర్య నలుపు దుస్తుల్లో తనదైన స్టైల్లో ఓరగా నడుస్తూ కనిపిస్తున్నాడు. మరో పోస్టర్లో ఓ భారీ విగ్రహం, త్రిశూలాలు, ఆయుధాలతో కూడిన గర్భగుడి.. వంటివి కనిపించి సినిమాపై క్యూరియాసిటీ కలిగేలా చేశాడు. టీజర్ విషయానికి వస్తే..
1.42 సెకెన్ల నిడివి ఉన్న టీజర్ పవర్ ఫుల్గా సాగింది. 'కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగొచ్చే దేవుడు' అంటూ సూర్య అదిరిపోయే డైలాగ్తో టీజర్ మొదలైంది. నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరుంది.. అంటూ కోర్ట్ రూమ్ వాదనలు, ట్రైన్ సీన్ యాక్షన్ ఇంటెన్స్గా ఉంది. సాయి అభ్యాంకర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గ్రాండ్గా ఉంది. ఇందులో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు లాయర్గా మరొకరు విలేజ్లో ఓ మాస్ లీడర్గా కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
Sirr 🧨🧨🧨🧨🧨 #Karuppu https://t.co/shIoLaDkan
— abhyankkar (@SaiAbhyankkar) July 22, 2025
నయనతారతో ‘అమ్మోరు తల్లి’చిత్రం తెరకెక్కించిన నటుడు ఆర్జే బాలాజీ (RJ Balaji)..ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. సూర్యకి జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) నటిస్తుంది. అయితే.. సూర్య, త్రిష ఇద్దరు కలిసి 2005లో చేసిన ఆరు సినిమా తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. అంటే 19 ఏళ్ల తర్వాత ఈ జంట స్క్రీన్ పై మెరుస్తుండటం విశేషం.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని, వరుస షూటింగ్ షెడ్యూల్స్తో బిజీగా ఉంది. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీ, 2025 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే డైరెక్టర్ ఆర్జే బాలాజీ రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన మల్టీ టాలెంటెడ్. యాక్టర్‌గా, సింగర్‌గా, కమెడియన్, డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. సూర్య తన 45వ సినిమా పూర్తియిన తర్వాత స్టార్ డైరెక్టర్ వెట్రీ మారన్ తో 46వ చిత్రం ఉంటుంది. వెంకీ అట్లూరితో మరో సినిమా చేస్తున్నాడు.