Suriya46: బర్త్డే స్పెషల్.. సూర్య-వెంకీ అట్లూరి మూవీ అప్డేట్

Suriya46: బర్త్డే స్పెషల్.. సూర్య-వెంకీ అట్లూరి మూవీ అప్డేట్

స్టార్ హీరో సూర్య తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇవాళ (జులై23న) సూర్య పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్స్ ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి.

నేడు ఉదయం తమిళ మూవీ ‘కరుప్పు’నుంచి టీజర్ రిలీజై మంచి అంచనాలు పెంచింది. ఈ క్రమంలో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి సినిమా నుండి అప్డేట్ అనౌన్స్ అయింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సూర్య ఫీల్ అండ్ ఫ్రెష్ లుక్లో కనిపిస్తున్నాడు.

‘మా ప్రియమైన ఏకైక, ఎప్పటికీ వృద్ధాప్యం కాని, యవ్వనంగా ఉండే సూర్యుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు! సూర్య46 మీ అభిరుచి మరియు ఉనికి ప్రతి ఫ్రేమ్‌ను వెలిగిస్తాయని’ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ తెలిపింది.

ధనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి హిట్ మూవీస్ రూపొందించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సూర్య నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ధనుష్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇది సూర్య కెరియర్లో 46వ సినిమాగా రానుంది. సూర్యకి జోడిగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. మూవీ 2026 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.