సూర్య కరుప్పు రిలీజ్ డేట్ ఫిక్స్..

సూర్య కరుప్పు రిలీజ్ డేట్ ఫిక్స్..

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై   ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న చిత్రం ‘కరుప్పు’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గురువారం ఉగాది సందర్భంగా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సమ్మర్ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మే 14న వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూర్య  ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు.  త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో  ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం  అందిస్తున్నాడు.  ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.