RETRO Box Office: రెట్రో క‌లెక్ష‌న్స్ ప్రకటించిన మేకర్స్.. నానికి ఏ మాత్రం పోటీ ఇవ్వని సూర్య!

RETRO Box Office: రెట్రో క‌లెక్ష‌న్స్ ప్రకటించిన మేకర్స్.. నానికి ఏ మాత్రం పోటీ ఇవ్వని సూర్య!

సూర్య ‘రెట్రో’ (Retro) మూవీ బాక్సాఫీస్ వసూళ్లను మేకర్స్ ప్రకటించారు. భారీ అంచనాల నడుమ మే1న రిలీజైన ఈ మూవీ మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. దాంతో రిలీజై 5 రోజులైనా వసూళ్లను అనౌన్స్ చేయలేకపోయారు.

ఈ క్రమంలో నేడు (మే6న) అధికారిక పోస్టర్ ద్వారా రెట్రో వసూళ్లను వెల్లడించారు. ఇప్పటివరకు ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.104కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ తెలిపారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ, రూ.47.66కోట్ల నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, కంగువ వంటి భారీ డిజాస్టర్ తర్వాత సూర్య సినిమా వస్తోందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు రెట్రోతో నిరాశే మిగిలింది. త‌మిళ‌నాడు మిన‌హా మిగిలిన రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఏ మాత్రం సంద‌డి చేయ‌లేక‌పోతుంది. కానీ, ఈ సినిమాకు పోటీగా వచ్చిన హిట్ 3 మాత్రం వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే వందకోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దాదాపు రూ.60కోట్ల నెట్ వసూళ్లు చేసింది. 

రెట్రో బాక్సాఫీస్:

సాక్నిల్క్ ప్రకారం నెట్ వసూళ్లు,

మే1న [1వ గురువారం] రూ.19.25 కోట్లు [తమిళ వెర్షన్: రూ.17.25 కోట్లు ; తెలుగు రూ.1.95
మే2 [1వ శుక్రవారం] రూ.7.75 కోట్లు [తమిళ వెర్షన్ రూ.7.05 కోట్లు ; తెలుగు రూ.0.67
మే3 [1వ శనివారం] రూ.8 కోట్లు [తమిళ వెర్షన్ రూ.7.3 కోట్లు ; తెలుగు రూ.0.65; 
మే4 [1వ ఆదివారం] రూ.8.15 కోట్లు [తమిళ వెర్షన్ రూ.7.45 కోట్లు ; తెలుగు రూ.0.65
మే5 [1వ సోమవారం] రూ.3.4 కోట్లు [తమిళ వెర్షన్ రూ.2.95 కోట్లు ; తెలుగు రూ.0.4
మే6 [1వ మంగళవారం] రూ.1.11 కోట్లు 
మొత్తం రూ.47.66 కోట్లు నెట్. 

రూ.82 కోట్ల బ్రేక్ ఈవెన్:

రెట్రో మూవీని సూర్య, జ్యోతిక హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ మరియు స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీకి ప్రమోషన్స్, రెమ్యునరేషన్స్తో కలిపి సుమారుగా రూ.70 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. అదే మాదిరిగా వరల్డ్ వైడ్ గా రూ.80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది. తెలుగులో తొమ్మిదిన్న‌ర కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. దాంతో ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది.