కొంత గ్యాప్ తర్వాత మరోసారి ఖాకీ చొక్కాలో కనిపించబోతున్నాడు సూర్య. ఆయన హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సీన్’. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ కో-ప్రొడ్యూసర్. ఇటీవల ఈ మూవీ తమిళ టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్.. గురువారం తెలుగు వెర్షన్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో ప్రేమ్ రాజ్ అనే పోలీస్ ఆఫీసర్‌గా సూర్య కనిపించాడు. హోదాకు డీఎస్పీ అయినా అతనో సైకో అని, ఒకేచోట కూర్చొని సిగరెట్లు తాగుతుంటాడని తన క్యారెక్టర్‌ను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేశారు. 'ప్రేమ్ రాజ్' సార్ కనిపిస్తే ఖైదీలు అందరూ అదొక టైప్ లో బిహేవ్ చేస్తారు..” అంటూ తన పాత్రకు ఇచ్చిన ఇంట్రడక్షన్ ఆసక్తి రేపింది. ‘‘నీకు నేను నిన్ను అరెస్ట్ చేసిన ఒక పోలీసుని కావొచ్చు. కానీ నాకు.. నేను జైల్లో వేసిన 900 మంది చిల్లర క్రిమినల్స్‌లో నువ్వో చిల్లరగాడివి..” అంటూ సూర్య చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. నజ్రియా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నస్లెన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమా విడుదల కానుంది.
