కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు నీటి మళ్లింపుపై.. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ కు చేరిన సర్వే రిపోర్ట్

కేసీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు నీటి మళ్లింపుపై.. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ కు చేరిన సర్వే రిపోర్ట్

ములుగు/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్‌‌‌‌‌‌‌‌ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని పాండురంగ చెరువు నుంచి మాజీ సీఎం, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు నీటిని మళ్లిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు నిర్వహించిన సర్వే నివేదిక సిద్దిపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌కు చేరినట్టు సమాచారం. 58 ఎకరాల విస్తీర్ణంలో తవ్విన ఈ చెరువు నుంచి ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌కు నీటిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇటీవల హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ (డీడీ) సువర్ణ, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ (ఈఈ) శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, డీఈఈ చాందీరాం నాయక్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆయా శాఖల మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పాండురంగ చెరువు నుంచి నీళ్లు ఎక్కడెక్కడికి సరఫరా అవుతున్నాయి, ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే అంశాలను పరిశీలించారు.

జోన్ల వారీగా బోరు మోటార్లు, పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న తీరును తనిఖీ చేశారు. అలాగే గతంలో ఎర్రవల్లికి మంజూరైన డ్రిప్‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ పథకం అమలు తీరును ప్రత్యేకంగా పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గమనించిన అంశాలతో అధికారులు నివేదిక రూపొందించి కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు పంపించినట్టు తెలిసింది. నివేదికలోని అంశాలను ఉన్నతాధికారులు పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.