కంగువ ఇంటెన్స్ పెంచేసింది..ఆటవిక యోధుడిగా సూర్య వైల్డ్ లుక్

కంగువ ఇంటెన్స్ పెంచేసింది..ఆటవిక యోధుడిగా సూర్య  వైల్డ్ లుక్

కమర్షియల్ సినిమాల్లోనూ ప్రయోగాలు చేస్తూ తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సూర్య 42(Suriya42) వ చిత్రం కంగువ(Kanguva). సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి..అగ్నితో సెగలు రేపే సూర్య కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్లో ఆటవిక యోధుడిగా వైల్డ్ లుక్లో సూర్య ఇంటెన్స్ పెంచుతున్నాడు. సూర్య వెనుకల అతని అటవీ సైన్యం..పోరాడే యోధుడిలా బలమిస్తూ నిలబడే పోస్టర్తో సినిమాపై డైరెక్టర్ అంచనాలు పెంచేశారు.  

కంగువా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శివ (Shiva) తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను యూవీ క్రియేషన్స్ (UV Creations), స్టూడియో గ్రీన్(Studio green) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా..వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :- త్రండి కాబోతున్న యంగ్ హీరో నిఖిల్!