త్రండి కాబోతున్న యంగ్ హీరో నిఖిల్!

త్రండి కాబోతున్న  యంగ్ హీరో నిఖిల్!

కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ సినిమాతో పాన్ ఇండియ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న టాలీవుడ్  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. ఈ మూ వీ సక్సెస్ తో నిఖిల్ దశ తిరిగింది. బడా నిర్మాతలు ఈ కుర్ర హీరోతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో నిఖిల్ పాన్ ఇండియా సినిమాలను లైన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం స్వయంభూ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం  తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా నిఖిల్ త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల నిఖిల్ తన భార్య పల్లవితో కలిసి ఓ ఈవెంట్ సందడి చేశాడు. ఈ ప్రొగ్రామ్ లో  నిఖిల్ భార్య బేబి బంప్ తో  కనిపించిందని.. నిఖిల్ దంపతులు పేరేంట్స్ కాబోతున్నట్లు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే, ప్రెగ్నెన్సీపై నిఖిల్ ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.2020లో  నిఖిల్, పల్లవిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.