ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్ట్‌‌‌‌లకు సూర్య, ఇషాన్‌‌‌‌

ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్ట్‌‌‌‌లకు సూర్య, ఇషాన్‌‌‌‌
  •     కివీస్‌‌‌‌తో టీ20లకు పృథ్వీ 
  •     కోహ్లీ, రోహిత్‌‌‌‌కు నో ప్లేస్​

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌‌‌తో వన్డే, టీ20 సిరీస్‌‌‌‌లతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌‌‌‌లకు ఇండియా టీమ్‌‌‌‌ను సెలెక్టర్లు శుక్రవారం ప్రకటించారు. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో దుమ్మురేపుతున్న సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ను టెస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌లోకి తీసుకున్నారు. గాయంతో బాధపడుతున్న బుమ్రాతో పాటు మోకాలి సర్జరీ నుంచి కోలుకుంటున్న రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకోలేదు. గతేడాది ఆగస్ట్‌‌‌‌ నుంచి ఆటకు దూరమైన ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ రవీంద్ర జడేజాకు చాన్స్‌‌‌‌ ఇచ్చారు. అయితే అతను ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్యామిలీ కమిట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ కారణంగా  రాహుల్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌.. న్యూజిలాండ్‌‌‌‌తో వన్డే, టీ20లకు దూరంగా ఉండనున్నారు. వన్డే జట్టుకు ఎంపికైన రోహిత్‌‌‌‌, కోహ్లీని షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌ నుంచి తప్పించారు. 

న్యూజిలాండ్‌‌‌‌తో వన్డేలకు ఇండియా జట్టు: 

రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, కోహ్లీ, శ్రేయస్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, కేఎస్​ భరత్‌‌‌‌, హర్దిక్‌‌‌‌, సుందర్‌‌‌‌, షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్, చహల్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌, షమీ, సిరాజ్‌‌‌‌, ఉమ్రాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌. 

కివీస్‌‌‌‌తో టీ20లకు టీమ్‌‌‌‌: 

హార్దిక్‌‌‌‌ పాండ్యా (కెప్టెన్‌‌‌‌), సూర్యకుమార్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌, రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, దీపక్‌‌‌‌ హుడా, రాహుల్‌‌‌‌ త్రిపాఠి, జితేష్‌‌‌‌ శర్మ, వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, యజ్వేంద్ర చహల్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌, ఉమ్రాన్‌‌‌‌ మాలిక్‌‌‌‌, శివమ్‌‌‌‌ మావి, పృథ్వీ షా, ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌.

ఆసీస్‌‌‌‌తో రెండు టెస్ట్‌‌‌‌లకు టీమిండియా: 

రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), రాహుల్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, పుజారా, కోహ్లీ, శ్రేయస్‌‌‌‌, కేఎస్‌‌‌‌ భరత్‌‌‌‌, ఇషాన్‌‌‌‌, అశ్విన్‌‌‌‌, అక్షర్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌, జడేజా, షమీ, సిరాజ్‌‌‌‌, ఉమేశ్‌‌‌‌, జైదేవ్‌‌‌‌ ఉనాద్కట్​, సూర్యకుమార్‌‌‌‌.