ముల్లన్‌పూర్: భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 18 నెలలుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సూర్యను, యూకే పర్యటనకు ముందే కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా ఆటగాడిగానూ జట్టు నుంచి దూరం పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఐపీఎల్ ముగిసేవరకు వేచిచూసినా అతడి ఆటతీరులో మార్పు రాకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని బోర్డు వర్గాలు తెలిపాయి.
సూర్య స్థానంలో కొత్త కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్, యువ ఆటగాడు తిలక్ వర్మ అగ్రస్థానంలో నిలిచారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గతంలో ఐపీఎల్ విజేతగా నిలిపిన అనుభవం శ్రేయస్‌కు అనుకూలించే అంశం. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్కువ వయసున్న తిలక్ వర్మ వైపు సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపుతోంది.
