Suryakumar Yadav Retirement: టీమిండియా కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ ని పీకేసి, శ్రేయస్ అయ్యర్ కి జట్టు పగ్గాలు అప్పగించినప్పటికీ నుంచి సోషల్ మీడియాలో అనేక రకరకాల విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం చాలదన్నట్లు, ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్)లో ఒక షాకింగ్ పోస్టు బాగా వైరల్ అవుతుంది. సూర్యకుమార్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడంటూ ఓ పోస్ట్ వెలుగులోకి వచ్చింది.
క్రికెట్ కి సూర్య రిటైర్మెంట్:
సూర్యకుమార్ యాదవ్ పేరుతో ఉన్న ఒక అకౌంట్ నుంచి ఈ పోస్ట్ బయటకి వచ్చింది. టీమిండియాకు ఆడటం నా లైఫ్ లోనే దొరికిన అతి పెద్ది గౌరవం.. డెబ్యూ మ్యాచులో కొట్టిన ఫస్ట్ సిక్స్ నుంచి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఎత్తే వరకు ఈ జర్నీని నేను ఎప్పుడూ మర్చిపోలేను.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను.. బీసీసీఐ, నా టీమ్మేట్స్, ఫ్యాన్స్ అందరికి థాంక్యూ, ఇక నెక్ట్స్ చాప్టర్ త్వరలోనే ప్రారంభిస్తానని ఆ పోస్టులో పేర్కొనడంతో, ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
సూర్యపై తప్పుడు ప్రచారం:
సూర్యకుమార్ ని కెప్టెన్సీతో పాటు ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ ల నుంచి బీసీసీఐ తప్పించింది. ఇప్పటికే సూర్యపై వేటుని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే, ఈ పోస్టు వైరల్ కావడం తీవ్ర ఆందోళనకి గురి చేస్తుంది. అయితే కొందరు వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు వార్తలని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బీసీసీఐ గానీ, సూర్యకుమార్ కానీ రిటైర్మెంట్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.. కాబట్టి, నెట్టింట వైరల్ అవుతున్న ఆ పోస్టు నిజం కాదని తెలుస్తుంది.
Representing India was the honour of my life. From a debut six to lifting the T20 World Cup, this journey was unforgettable. I have decided to retire from international cricket. Thank you BCCI, teammates, and fans. Onto the next chapter! 🇮🇳💙 #GrindNeverStops
— SuryaKumar Yadav (@unreal_skyy) June 7, 2026
