సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20లో భారీ విజయాన్ని అందుకొని టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. చేసింది 175 పరుగులే అయినా 101 పరుగుల తేడాతోసఫారీలను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య గురువారం (డిసెంబర్ 11) రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సూర్య పేలవ ఫామ్ ఇందుకు కారణం.
టీ20 స్పెషలిస్ట్ గా.. విధ్వంసకర ఆటగాడిగా పేరున్న సూర్య ఫామ్ లేకపోవడం భారత జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. భారత జట్టు టీ20జట్టు కెప్టెన్సీ అప్పగించిన దగ్గర నుంచి సూర్య బ్యాటింగ్ లో పెద్దగా రాణించడం లేదు. ఎప్పుడో ఒకసారి మెరుస్తున్నా నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నాడు. జట్టు విజయాలు సాధిస్తున్నా.. ఈ టీమిండియా కెప్టెన్ ఫామ్ పై ఆందోళన అలాగే ఉంది. ఆసియా కప్ లో ఘోరంగా విఫలమైన సూర్య.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లోనూ తన చెత్త ఫామ్ కొనసాగించాడు. మంగళవారం (డిసెంబర్ 9) సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లోనూ 12 పరుగులే చేసి నిరాశపరిచాడు.
Also read:- బుమ్రా నో బాల్‌పై చెలరేగుతున్న వివాదం..
2025లో సూర్య టీ20 గణాంకాలు ఘోరంగా ఉన్నాయి. ఆడిన 16 ఇన్నింగ్స్ ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. వీటిలో మూడు డకౌట్ లు ఉన్నాయి. నాలుగు సార్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. యావరేజ్ కేవలం 15 మాత్రమే ఉంది. కెప్టెన్ గా విజయాలు సాధిస్తున్నా.. బ్యాటింగ్ లో నిరాశపరుస్తున్నాడు. దీంతో రెండో టీ20లో సూర్య ఫామ్ లోకి రావాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్ లో సూర్య అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. పొట్టి ఫార్మాట్లో వరుసగా 14 సార్లు 25 ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్ దక్షిణాఫ్రికా సౌతాఫ్రికా బ్యాటర్ టెంబా బవుమా పేరిట ఉండేది. బవుమా వరుసగా 13 సార్లు 25 ప్లస్ పైగా పరుగులు చేశాడు. ఐపీఎల్ 18లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో బవుమా వరల్డ్ రికార్డ్‌ను సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ లో అడగొట్టిన సూర్య టీమిండియా అనేసరికి ఫెయిల్ అవుతున్నాడు. దీంతో నెటిజన్స్ సూర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు సూర్య ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యం.
Suryakumar Yadav’s form has faltered since he became full-time T20I captain.#INDvSA pic.twitter.com/g9VYU1zTLr
— CricTracker (@Cricketracker) December 9, 2025

