సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌!..ఢిల్లీతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులోకి

సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌!..ఢిల్లీతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులోకి

న్యూఢిల్లీ :  హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ పరాజయాలతో ఇబ్బందిపడుతున్న ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌. చీలమండ, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ హెర్నియా గాయాల నుంచి సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అతనికి ఎన్‌‌‌‌‌‌‌‌సీఏ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం ఢిల్లీతో జరగబోయే మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు సూర్య అందుబాటులో ఉండే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. ‘సూర్య ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో ఉన్నాడు.

ఎన్‌‌‌‌‌‌‌‌సీఏ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో మెరుగ్గా కనిపించాడు. వీలైనంత త్వరగా ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌తో కలుస్తాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన వంద శాతం ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో ఉన్నాడు. కాబట్టి ఢిల్లీతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కు ముందు నిర్వహించిన ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో అతను పాస్‌‌‌‌‌‌‌‌ కాలేకపోయాడు. అందుకే ఇన్ని రోజులు వెయిట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి వచ్చింది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా చీలమండలో గ్రేడ్‌‌‌‌‌‌‌‌–2 గాయానికి గురైన సూర్యకు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ తర్వాత స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ హెర్నియా తలెత్తింది. దీంతో నాలుగు నెలల పాటు అతను ఆటకు దూరంగా ఉన్నాడు.