తొలి టీ20లో గెలిచి సౌతాఫ్రికాపై గెలిచి జోరు మీదున్న టీమిండియాకు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కనీస పోటీ అవ్వకుండా చేతులెత్తేసింది. మొదట బౌలర్లు ఘోరంగా విఫలం కాగా.. ఆ తర్వాత బ్యాటర్లు కూడా పెవిలియన్ బాట పట్టారు. బ్యాటింగ్ లో తిలక్ వర్మ, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. భారత ఓటమికి కారణం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ సూర్య కామెంట్స్ చేశాడు.
ఓటమి తర్వాత సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " శుభమాన్ గిల్, నేను ఎల్లప్పుడూ అభిషేక్ పై ఆధారపడలేము. ప్రతి మ్యాచ్ అభిషేక్ గెలిపించలేడు. నేను, గిల్ బాధ్యత తీసుకోవాల్సింది. మేము మంచి ఆరంభాన్ని ఇచ్చి ఉండాల్సింది. బాగా ఆడితే టార్గెట్ ఛేజ్ చేయొచ్చు. గిల్ మొదటి బంతికే ఔటయ్యాడు. ఆ సమయంలో నేను బాధ్యత తీసుకొని ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లి ఉంటే బాగుండేది. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. తర్వాత మ్యాచ్ నుంచి మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం". అని సూర్య ఓటమికి తనను తాను నిందించుకున్నాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే సౌతాఫ్రికాపై రెండో టీ20లో టీమిండియా ఓడిపోయింది. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైన టీమిండియాకు పరాభవం తప్పలేదు. మరోవైపు సౌతాఫ్రికా ఆల్ రౌండ్ షో తో అదరగొట్టి 51 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. డికాక్ (90) బ్యాటింగ్ లో చెలరేగితే.. బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించి సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించారు.
"We can't rely on Abhishek all the time," says Suryakumar Yadav after India's 51-run loss. pic.twitter.com/4KpFqRUr9O
— Cricbuzz (@cricbuzz) December 11, 2025

