IND vs SA: ఆ ఇద్దరూ ఫిట్‌గానే ఉన్నారు.. తొలి టీ20లో ఓపెనింగ్ చేసేది వారే: సూర్య

IND vs SA: ఆ ఇద్దరూ ఫిట్‌గానే ఉన్నారు.. తొలి టీ20లో ఓపెనింగ్ చేసేది వారే: సూర్య

ఇండియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్ పై ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టి నెలకొంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్  తలపడేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య మంగళవారం (డిసెంబర్ 9) నుంచి 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కటక్ వేదికగా బారబత్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20ల్లో దూసుకుపోతున్న టీమిండియా ఈ సిరీస్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. తొలి టీ20 మ్యాచ్ కు స్టార్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్య, శుభమాన్ గిల్ ఫిట్ గా ఉన్నట్టు టీమిండియా టీ20 కెప్టెన్ కన్ఫర్మ్ చేశాడు.

విలేఖరుల సమావేశంలో సూర్య మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " గిల్, పాండ్య తొలి టీ20 మ్యాచ్ కు పూర్తి ఫిట్ నెస్ సాధించారు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో శుభ్‌మన్ ఓపెనింగ్ చేశాడు. శుభమాన్ మిస్ కావడంతో సంజుకు వరుసగా ఓపెనింగ్ అవకాశాలు ఇచ్చాము. శాంసన్ చాలా విలువైన ఆటగాడు. అతను ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. తదుపరి రెండు సిరీస్ లలో పెద్దగా మార్పులు చేయాలని భావించడం లేదు. హార్దిక్ పాండ్యా రావడంతో జట్టు సమత్యులంగా మారింది. అతని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రధాన టోర్నమెంట్ లో పాండ్య బాగా రాణిస్తాడు". అని సూర్య చెప్పుకొచ్చాడు. 

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో మెడ నొప్పితో గాయపడిన గిల్.. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఈ క్రమంలో గిల్ సౌతాఫ్రికాతో రెండో టెస్టుతో పాటు.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. మరోవైపు ఆసియా కప్ లో గాయపడిన పాండ్య పూర్తిగా కోలుకొని ఫిట్ నెస్ టెస్ట్ క్లియర్స్ చేసి ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. వీరిద్దరూ జట్టులో ఉండడంతో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. సూర్య మాటలను బట్టి చూస్తుంటే ఓపెనర్లుగా శుభమాన్ గిల్, అభిషేక్ శర్మ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. సంజు శాంసన్ ఐదో స్థానంలోనే బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సౌతాఫ్రికాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ఇండియా స్క్వాడ్: 

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్)*, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్-కీపర్), సంజు శాంసన్ (వికెట్-కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్