సూర్యకుమార్ యాదవ్: గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు పెద్దగా ఏడీ కూడా కలిసి రావట్లేదు.. ఈ ఏడాది తన సారథ్యంలో టీమిండియాకు టీ20 ప్రపంచకప్ 2026 అందించినప్పటి నుంచి అతడికి కష్టకాలం మొదలైంది. అంతకు కొన్ని నెలల నుంచి ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య.. తీవ్ర విమర్శలని ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లోనూ తీవ్రంగా నిరాశపర్చడంతో.. తాజాగా భారత జట్టు టీ20 కెప్టెన్సీతో పాటు తుది జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇక ఇప్పుడు అతడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
వచ్చే ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుని వీడనున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతుంది. చాలా ఏళ్లుగా ముంబైలో కీలక ఆటగాడిగా ఉన్న సూర్య భాయ్.. ఆ జట్టుకు గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ నడుస్తుంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. ఇన్ స్టాలో ముంబైని అన్ ఫాలో చేసిన విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, అతడు ముంబైకి సంబంధించిన 100కు పైగా పోస్టులను తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి ఇన్ స్టాలో ఒక్క ఫోటో కూడా ముంబైకి సంబంధించినది లేదని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అది కూడా రోహిత్ శర్మ (Rohit Sharma), మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో కలిసి దిగిన ఫోటోలు ఉండటం గమనార్హం.
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ముంబై ఇండియన్స్ జట్టుని వీడాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కూడా.. ముంబైని వదిలి పెట్టాలని నిర్ణయించుకున్నాడని జోరుగా ప్రచారం నడుస్తుంది. కాగా ప్రస్తుతం సూర్య.. ఇన్ స్టాలో హార్దిక్ పాండ్యాను కూడా ఫాలో కాకపోవడం గమనార్హం. కాగా గత కొన్ని సీజన్లుగా దారుణ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కూడా జట్టును ప్రక్షాళన చేయాలని చూస్తోంది. అందుకే కొత్త ప్లేయర్స్ తో జట్టును పునర్మించుకోవాలని డిసైడ్ అయినట్లు టాక్. దీనిపై కొన్ని రోజుల తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
🚨 Suryakumar Yadav removed 139 Mumbai Indians posts from his Instagram.
— Indian Cricket Ministry (@ICM_News45) June 8, 2026
Yesterday, Surya even unfollowed Mumbai Indians and deleted all MI-related posts.
Yesterday, his post count was 1412, and now it is only 1274. His following count was also 581, but now it is only 580.
Now… pic.twitter.com/YnzLShQdvU
