టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం పేలవ ఫామ్ లో ఉన్నాడు. భారత జట్టు టీ20 జట్టు కెప్టెన్సీ అప్పగించిన దగ్గర నుంచి సూర్య బ్యాటింగ్ లో పెద్దగా రాణించడం లేదు. ఎప్పుడో ఒకసారి మెరుస్తున్నా నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నాడు. జట్టు విజయాలు సాధిస్తున్నా.. ఈ టీమిండియా కెప్టెన్ ఫామ్ పై ఆందోళన అలాగే ఉంది. ఆసియా కప్ లో ఘోరంగా విఫలమైన సూర్య.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ తన చెత్త ఫామ్ కొనసాగిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముందు సూర్య ఫామ్ లోకి రావడం చాలా ముఖ్యం.
సూర్య తన ఫామ్ కోసం సౌతాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ను సహాయం కోరాడు. ఏదైనా సలహా ఇవ్వాలని కోరాడు. టీ20 క్రికెట్, వన్డే ఫార్మాట్ ను ఎలా బ్యాలన్స్ చేసుకోవాలో తనకు వివరించాలని చిట్కా కోరాడు. సూర్య మాట్లాడుతూ ఇలా అన్నాడు. "నేను డివిలియర్స్ ను త్వరలో కలిస్తే టీ20, వన్డే ఫార్మాట్ లను ఎలా బ్యాలన్స్ చేసుకోగలిగాడో నేను అడగాలనుకుంటున్నాను. రెండు ఫార్మాట్ లలో రాణించడంతో నేను విఫలమయ్యాను. వన్డేలను టీ20 ల ఆడాలని నేను భాన్వయించాను. రెండు ఫార్మాట్లలో ఎలా సక్సెస్ అయ్యాడో అతన్ని అడగాలనుకుంటున్నాను.
ఏబీ మీరు నా మాటలను వింటుంటే దయచేసి త్వరగా నన్ను సంప్రదించండి. ఎందుకంటే ఆ కెరీర్ లో రాబోయే మూడు-నాలుగు సంవత్సరాలు చాలా కీలకం. నేను వన్డే క్రికెట్ ఆడడానికి కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయండి. నేను టీ20, వన్డేలను బ్యాలన్స్ చేయలేకపోయాను". అని విమల్ కుమార్‌తో మాట్లాడుతూ డివిలియర్స్ కు సూర్యకుమార్ యాదవ్ రిక్వెస్ట్ చేశాడు. ఇండియా తరపున సూర్య టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. వన్డే, టెస్టుల్లో అతనికి స్థానం దక్కడం లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతూ బిజీగా ఉన్న సూర్య గురువారం (నవంబర్ 6) ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఇప్పటివరకు ఇండియా తరపున సూర్య 37 వన్డేలు ఆడాడు. టీ20 అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పుడు వన్డే జట్టులో తరచూ అవకాశాలు వచ్చాయి. అయితే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇచ్చినా సూర్య విఫలమయ్యాడు. దీంతో సూర్యను కేవలం టీ20లకే పరిమితం చేశారు. భవిష్యత్ లో వన్డే క్రికెట్ ఆడాలనుకుంటున్న సూర్యకు చోటు దక్కుతుందో లేదో చూడాలి.
Indian T20I skipper Suryakumar Yadav sought advice from former South African legend AB de Villiers on balancing ODI and T20I formats. pic.twitter.com/eb5YFuFtCV
— CricTracker (@Cricketracker) November 4, 2025
