నిర్భయంగా బ్యాటింగ్ చేశా : సూర్యకుమార్ యాదవ్

నిర్భయంగా బ్యాటింగ్ చేశా : సూర్యకుమార్ యాదవ్

విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గామొదటి పోరులోనే జట్టును గెలిపించినందుకు గర్వంగా ఉందని అంటున్నాడు. వైజాగ్‌‌‌‌‌‌‌‌లో  బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సూర్య 42 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 80 రన్స్‌‌‌‌‌‌‌‌తో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. దాంతో ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో  ఇండియా హయ్యెస్ట్  టార్గెట్ ఛేజ్​ (209) చేసి  రికార్డు సృష్టించింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో తాను నిర్భయంగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేశానని సూర్య చెప్పాడు. 

స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లోనే రెండు వికెట్లు పడిన తర్వాత యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్ తనకు మంచి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడన్నాడు. ఓవైపు తాను నిర్భయంగా ఆడుతుంటే మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటిన ఇషాన్​ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు  కీలకమైందన్నాడు. చివర్లో ఒత్తిడిలో రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ చాలా ప్రశాంతంగా ఆడి జట్టును ఒడ్డుకు చేర్చడం గొప్ప విషయం అన్నాడు.  ‘తొలుత ఆసీస్‌‌‌‌‌‌‌‌ 200 ప్లస్‌‌‌‌‌‌‌‌ స్కోరు చేసిన తర్వాత డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లో కొంచెం టెన్షన్​ పడ్డాం. 

ఎందుకంటే మా టీమ్‌‌‌‌‌‌‌‌లో ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్న ప్లేయర్లు లేరు. కానీ, కుర్రాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. బోర్డ్‌‌‌‌‌‌‌‌పై అంత స్కోరు చూశాక ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిస్తే చాలా బాగుంటుందన్నారు. దేశానికి కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నా. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే జట్టు విజయానికి కృషి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సూర్య చెప్పుకొచ్చాడు.