IPL 2024: ముంబైకు బిగ్ షాక్.. SRH మ్యాచ్‌కు వరల్డ్ నం.1 బ్యాటర్ దూరం

IPL 2024: ముంబైకు బిగ్ షాక్.. SRH మ్యాచ్‌కు వరల్డ్ నం.1 బ్యాటర్ దూరం

ఐపీఎల్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. 2012 నుంచి ముంబై ఇండియన్స్ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ఓడిపోయే సంప్రదాయాన్ని కొనసాగించింది. రెండో మ్యాచ్ రేపు (మార్చి 27)న సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ దూరమయ్యాడు. 
 
ప్రస్తుతం సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతను NCA నుండి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడంలో విఫలమయ్యాడు. రెండు వారాల క్రితం ఈ ముంబై బ్యాటర్ NCAలో చేరాడు. పూర్తి ఫిట్ నెస్ లేకపోవడంతో అతడు ఎప్పుడు పూర్తి ఫిట్ నెస్ సాధిస్తాడో చెప్పలేని పరిస్థితి. జూన్ లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ ఉంది. ఈ మెగా టోర్నీకి సూర్య ఫిట్ గా ఉండాలని.. బీసీసీఐ భావిస్తుంది. దీంతో ఈ వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ మరిన్ని మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉంది. 

2023 డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీతో భారత్ ను గెలిపించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20లో సఫారీలపై టీమిండియా గెలిచి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో బంతిని ఆపే క్రమంలో సూర్య వెనక్కి ట్విస్ట్ అయ్యాడు. కాలు పట్టేయడంతో నడవలేకపోయాడు. దీంతో వైద్య  సిబ్బంది మోసుకుంటూనే సూర్యను తీసుకెళ్లారు. నొప్పితో విలవిల్లాడిన సూర్య మళ్ళీ మైదానంలో కనిపించలేదు.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న సూర్య మొదట చికిత్స తీసుకున్నా.. హెర్నియా తీవ్రం కావడంతో ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ తప్పలేదు. గ్రోయిన్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీ (స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ హెర్నియా)తో బాధపడుతున్న ఈ స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ కు 2024 జనవరి 18న మ్యూనిచ్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)లో సర్జరీ జరిగింది.