
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా ‘కథనం’ ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. అభిమన్యు సింగ్, పూజ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.ఎస్.రావు, విష్ణువర్ధన్ కలిసి నిర్మిస్తున్నారు.
ఇటీవల టీజర్, ‘మ్యాచింగ్ మ్యాచింగ్’ అనే స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న టీమ్, త్వరలో ట్రైలర్‌ను, కాలేజ్ బ్యాక్‌డ్రాప్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, ఈ నెలాఖరులో సినిమాను రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.