విక్రమ్ రాకెట్ సక్సెస్‌‌లో.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం వాసి కీలక పాత్ర

విక్రమ్ రాకెట్ సక్సెస్‌‌లో..  సూర్యాపేట జిల్లా చింతలపాలెం వాసి కీలక పాత్ర

మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు: విక్రమ్-1 స్పేస్ రాకెట్ సక్సెస్‌‌లో సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామ ఇంజనీర్ కీలక భూమిక పోషించాడు. చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన గంధం లక్ష్మీనాథ్ పదో తరగతి వరకు స్థానిక సిమెంట్ పరిశ్రమలోని సీతామెమోరియల్ స్కూల్ లో చదివి, ఆ తర్వాత ఉన్నత విద్యను హైదరాబాద్‌‌లో పూర్తి చేశాడు. ఆ తర్వాత డీఆర్‌‌‌‌డీఏలో చేరి ఎలక్ట్రికల్ విభాగంలో డిజైన్ అండ్ ఇంటిగ్రేషన్‌‌లో పని చేశాడు. దీంతో స్కైరూట్ ఏరో స్పేస్‌‌లో విక్రమ్ రాకెట్ ప్రాజెక్టు నిర్మాణంలో అవకాశం దక్కింది. విద్యుత్ వ్యవస్థ రూపకల్పన, సాంకేతిక పరీక్షల టీంలో లక్ష్మీనాథ్ కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రాజెక్టు సక్సెక్ కావడంతో యువ ఇంజనీర్ పేరెంట్స్ శ్రీను, శ్రీవాణి ఆనందం వ్యక్తం చేశారు.