ఐర్లాండ్ సిరీస్‌‌‌‌కు సూర్యవంశీని ఎంపిక చేయాలి: ఎమ్మెస్కే ప్రసాద్

ఐర్లాండ్ సిరీస్‌‌‌‌కు సూర్యవంశీని ఎంపిక చేయాలి: ఎమ్మెస్కే ప్రసాద్

ఢిల్లీ: 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అసాధారణ ప్రతిభావంతుడిగా, టీ20 క్రికెట్‌‌‌‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభివర్ణించారు. ఈ నెల చివర్లో జరిగే ఐర్లాండ్ సిరీస్‌‌‌‌కు అతడిని భారత జట్టులోకి ఎంపిక చేయాలని సూచించారు. శ్రీలంకలో జరిగే ఇండియా-ఎ ముక్కోణపు సిరీస్ ముగిసిన వెంటనే సీనియర్ జట్టులోకి తీసుకోవడానికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. 

అత్యంత ఒత్తిడితో కూడిన ఐపీఎల్‌‌‌‌లో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లను ఎదుర్కొని రాణించడమే భారత జట్టులోకి రావడానికి ఉత్తమ మార్గమని, సెలెక్టర్లు కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నారని చెప్పారు. సూర్యవంశీ వయసు కేవలం 15 ఏళ్లే కావడంతో అతడిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. 

కొంతకాలం రాహుల్ ద్రవిడ్ లేదా వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఉంచితే అతడి కెరీర్ సరైన మార్గంలో సాగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి టీ20ల ద్వారా ప్రారంభించి నెమ్మదిగా వన్డేలు, ఇతర సుదీర్ఘ ఫార్మాట్లలోకి అతడిని తీసుకురావాలన్నారు.