టీజర్ టాక్

టీజర్ టాక్

బుల్లితెరపై కామెడీ స్కిట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు హోస్ట్‌‌‌‌‌‌‌‌గానూ అలరిస్తున్న సుడిగాలి సుధీర్.. వెండితెరపై హీరోయిజం కూడా చూపిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ఇప్పుడు మరో రెండు చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తున్నాడు. వాటిలో అరుణ్ విక్కిరాల రూపొందిస్తున్న ‘కాలింగ్ సహస్ర’ ఒకటి. డాలీ షా, స్పందన పల్లి, శివ బాలాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజేష్ తయాల్, కాటూరి వెంకటేశ్వర్లు, పమిడి చిరంజీవి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిన్న అల్లు అరవింద్ రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ‘బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని  చూపించడం తప్పెలా అవుతుంది’ అనే డైలాగ్‌‌‌‌‌‌‌‌తో స్టార్టయిన టీజర్ ఇంటరెస్టింగ్‌గా అనిపించింది. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజయ్ శ్రీవాస్తవ్‌‌‌‌‌‌‌‌గా సుధీర్  కనిపిస్తున్నాడు. సస్పెన్స్‌‌‌‌‌‌‌‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీని రేపుతున్నాయి. సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూవీని రిలీజ్ చేయనున్నట్టు కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు.  దీంతో పాటు ‘గాలోడు’ సినిమాలోనూ నటిస్తున్నాడు సుధీర్.