డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ స్నేహితుడి అరెస్ట్

డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ స్నేహితుడి అరెస్ట్

ముంబయి: బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్యహత్యలో కీలక వ్యక్తి అతని రూమ్మేట్‌ సిద్ధార్ధ్‌ పితానీని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఏడాది అవుతోంది. సిద్దార్థ్ కూడా సుశాంత్ సింగ్ ఫ్లాట్ లోనే ఉండేవాడు. డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. అయితే  శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి వచ్చిన యాంటీ డ్రగ్స్‌ ఏజెన్సీ సిద్ధార్ధ్‌ను అరెస్టు చేసింది. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసులో సైతం పితానీని ముంబయి పోలీసులతో పాటు సిబిఐ అధికారులు కూడా పలు మార్లు ప్రశ్నించారు. సుశాంత్‌ మరణాంతరం బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కుంభకోణం వెలుగు రాగా.. సుశాంత్‌ రాజ్‌పుత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌లపై అభియోగాలు నమోదయ్యాయి. సిద్దార్థ్ ను పలుమార్లు ప్రశ్నించి విడిచిపెట్టిన ఎన్సీబీ అధికారులు ఇవాళ అరెస్టు చేయడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.