సుశాంత్ మెడ‌పై గాయాలు..ఫోర్సెన్సిక్ రిపోర్ట్ లో తేలిన నిజాలు

సుశాంత్ మెడ‌పై గాయాలు..ఫోర్సెన్సిక్ రిపోర్ట్ లో తేలిన నిజాలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై ముంబై పోలీసులు, సీబీఐ అధికారులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. ద‌ర్యాప్తులో భాగంగా జులై 27న సుశాంత్ ఉరికి ఉప‌యోగించిన కుర్తా 200కిలో బ‌రువును మోయ‌గ‌ల‌ద‌ని ముంబై పోలీసులు గుర్తించారు.

ఇండియా టుడే క‌థ‌నం ప్ర‌కారం.. కుర్తాకి ఉన్న ఫైబ‌ర్ , సుశాంత్ మెడ‌పై గుర్తులు, పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా సుశాంత్ ఉరేసుకునేందుకు కుర్తాను ఉప‌యోగించిన‌ట్లు దృవీక‌రించాయి. దీంతో కుర్తా బ‌లాన్ని గుర్తించేందుకు ఫోరెన్సిక్ టెస్ట్ చేయ‌గా.. ఆ టెస్ట్ ల్లో కుర్తా ఉరివేసుకునేందుకు అనువుగా ఉన్న‌ట్లు నిర్ధారించారు.

కాగా సుప్రీం కోర్ట్ తీర్పుతో సుశాంత్ సింగ్ మ‌ర‌ణంపై ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల బృందం..ఈ కేసుకు సంబంధించింది సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని, మరియు ఇంట్లో ప‌నిచేస్తున్న వంట‌మ‌నిషి నీరజ్ తో పాటు నటుడి మరణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియా చక్రవర్తిని ప్ర‌శ్నించ‌నున్నారు. రియా త‌ల్లిదండ్రులు, సోద‌రుడి స్టేట్మెంట్ల‌ను రికార్డ్ చేస్తారా లేదా అని తెలియాల్సి ఉంది.