డెడికేషన్ కు మారుపేరు సుష్మాస్వరాజ్ : మన్మోహన్ సింగ్

డెడికేషన్ కు మారుపేరు సుష్మాస్వరాజ్ : మన్మోహన్ సింగ్

దేశంపై ఎనలేని గౌరవం, అంకితభావం చూపించిన నాయకురాలు సుష్మాస్వరాజ్ అని కొనియాడారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆమె అత్యంత ప్రతిభావంతురాలైన నేత అని చెప్పారు. సుష్మా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మన్మోహన్.. తన సంతాప సందేశం ఇచ్చారు.

“సుష్మా మరణంతో షాక్ అయ్యాను. లోక్ సభలో అపోజిషన్ లీడర్ గా సుష్మా ఉన్నప్పుడు ఆమెతో స్నేహబంధం ఉండేది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఆమెకు అత్యంత గౌరవం ఇచ్చేవారు. ఆమె గొప్ప పార్లమెంటేరియన్. ఎనలేని గౌరవాన్ని సంపాదించుకుని.. అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకురాలిని కోల్పోయాం ” అని మన్మోహన్ చెప్పారు.

విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మస్వరాజ్ నిన్న మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో.. ఆమెను హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఐదుగురు డాక్టర్ల టీమ్ చికిత్స అందిస్తున్న సమయంలోనే.. గుండెపోటు తీవ్రం కావడంతో ఆమె కన్నుమూశారు. ఢిల్లీలోని ఆమె ఇంట్లో.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు సహా కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు , ప్రతిపక్ష నేతలు సుష్మాకు నివాళులు అర్పిస్తున్నారు.