
ఇటీవల తీవ్రమైన గుండెపోటు గురైన బాలీవుడ్ హీరోయిన్ సుస్మితాసేన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా తెలిపింది. గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయిందని సకాలంలో వైద్యులు చికిత్స చేయడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది. ముంబైలోని నానావతి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో శ్రమించి ప్రమాదం నుంచి బయటపడేలా చేశారంది. ఈ విషయం తన కుటుంబసభ్యులు, ఆప్తులకు మాత్రమే తెలుసనని వెల్లడించింది. చికిత్స పొందుతున్న టైమ్ లో ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పాలనుకోలేదని. చికిత్స పూర్తై తాను కోలుకున్న తర్వాతనే సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టానని పేర్కొంది. దాన్ని చూసి.. ‘గెట్ వెల్ సూన్’ అంటూ ఎంతోమంది పోస్టులు పెట్టారని తెలిపింది. తాను కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు ఈ సందర్భంగా సుస్మితాసేన్ ధన్యవాదాలు చెప్పింది. వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమైన ఆమె 2020లో వచ్చిన ‘ఆర్య’ సిరీస్‌తో మరోసారి కెమెరా ముందుకు వచ్చింది.