నీ కూతురుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా : సుష్మితా కుమార్తె రెనీ

నీ కూతురుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా : సుష్మితా కుమార్తె రెనీ

సుష్మితా సేన్ 47వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె కూతురు రెనీ.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. హ్యాహీ బర్త్ డే మై లైఫ్ లైన్ అనే వాక్యంతో మొదలుపెట్టిన రెనీ.. మీరు అత్యుత్తమ దశలో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. క్షమించే గుణం గల మీకు.. తాను కూతురుగా పుట్టడం దేవుడిచ్చిన వరమన్నారు. తాను చాలా అద-ృష్టవంతురాలినని, దానికి తానే సాక్ష్యం అని తెలిపింది. ప్రేమ, అంకితభావం, కష్టపడి పనిచేయడం... మీకు నటన పట్ల ఉన్న నిజాయితీ ఎల్లప్పుడూ మీ జీవితాన్ని ఎలా నడిపిస్తున్నారో ప్రతిబింబిస్తూనే ఉన్నాయని రాసుకొచ్చింది. దాంతో పాటు తల్లి సుష్మితాతో దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది.

అయితే తన కూతురు రెనీ చేసిన పోస్ట్ కు సుష్మితా కామెంట్ చేసింది. ఐ లవ్ యూ షోనా అని తన ప్రేమను వ్యక్తం చేసింది. దాంతో పాటు అది తన హక్కుఅని రాసుకొచ్చింది. అంతకు మునుపు తన తనకు అద్భుతమైన సంవత్సరం రాబోతుందంటూ ఇన్ స్టా లో సుష్మితా పోస్ట్ చేసింది.