లలిత్ మోడీ ట్వీట్లపై పరోక్షంగా సుస్మిత క్లారిటీ!

లలిత్ మోడీ ట్వీట్లపై పరోక్షంగా సుస్మిత క్లారిటీ!

తనపై లలిత్ మోడీ చేసిన ట్విట్స్ పై నటి సుస్మితా సేన్ పరోక్షంగా స్పందించారు. ల‌లిత్ మోడీ పేరును ప్రస్తావించ‌కుండా ఇన్‌స్టాగ్రామ్ లో ఓ  పోస్ట్ పెట్టారు. త‌న‌కు ఇంకా పెళ్లి కాలేద‌ని, క‌నీసం ఎంగేజ్ మెంట్ కూడా అవ్వలేదని సుస్మిత పోస్ట్ లో వివరించారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారామె. ‘నాకు నచ్చిన ప్రదేశంలో నేను సంతోషంగా ఉన్నాను. ఇంకా ఉంగరాలు మార్చుకోలేదు. పెళ్లి కాలే. కేవలం ప్రేమలో మునిగి తేలుతున్నా..ఈ వివరణ సరిపోతుందనుకుంటా' అంటూ తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో ఓ  పోస్ట్ షేర్ చేశారు. అయితే  లలిత్ మోడీతో డేటింగ్‌పై మాత్రం సుస్మిత నోరు విప్పక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

 

లండన్ లో లలిత్ మోడీ

అటు లలిత్ మోడీ మాత్రం సుస్మితా సేన్‌ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ గా మారాయి. పన్ను ఎగవేత కేసులో ఇండియాను విడిచిపెట్టిన లలిత్ మోడీ 2010 నుండి లండన్‌లోనే ఉంటున్నాడు. లలిత్ మోడీ గతంలో మినాల్ సగ్రానీని వివాహం చేసుకున్నాడు. 1991 అక్టోబర్ లో వీరి వివాహం జరిగింది. మినాల్ సగ్రానీ .. లలిత్ మోడీ కంటే పదేళ్లు పెద్ద. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.  2018లో మినాల్ సగ్రానీ క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయింది. అటు సుస్మితా సేన్‌కు అలీసా, రెనీ అనే  ఇద్దరు దత్తత తీసుకున్న పిల్లలున్నారు.