గ్రీవెన్స్ అర్జీలు వెంటనే పరిష్కరించాలి

గ్రీవెన్స్ అర్జీలు వెంటనే పరిష్కరించాలి

 

మహబూబాబాద్/ రేగొండ/ జనగామ అర్బన్/ వరంగల్​ సిటీ/ ములుగు/ హనుమకొండ కలెక్టరేట్ వెలుగు: గ్రీవెన్స్​లో ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణి నిర్వహించగా, మహబూబాబాద్​లో 148 వినతులు వచ్చాయని కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్​ తెలిపారు.  జయశంకర్​భూపాలపల్లిలో కలెక్టర్​ రాహుల్​శర్మ ప్రజల నుంచి మొత్తం 57 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు.  జనగామలో 59 వినతులు వచ్చాయని కలెక్టర్​ రిజ్వాన్​భాషా షేక్​ తెలిపారు. 

అనంతరం ప్రభుత్వ పథకాల అమలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్​ బల్దియా హెడ్​ఆఫీస్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు మొత్తం 109 దరఖాస్తులు వచ్చాయని, అందులో 49 టౌన్​ ప్లానింగ్​పైనే ఉన్నాయని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్​పాయ్ అన్నారు.  ములుగు కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు 85 అర్జీలు వచ్చాయని కలెక్టర్​ దివాకర తెలిపారు. ఆయా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్లు ఆదేశించారు.హనుమకొండ గ్రీవెన్స్​లో 176 అర్జీలు వచ్చాయని కలెకట్ర్ స్నేహ శబరీశ్​ తెలిపారు.