ప్రాధాన్య క్రమంలో సమస్యలు పరిష్కారం: పీఓ

 ప్రాధాన్య క్రమంలో  సమస్యలు పరిష్కారం: పీఓ

భద్రాచలం, వెలుగు: ప్రాధాన్య క్రమంలోసమస్యలు పరిష్కరిస్తామని ఐటీడీఏ పీవో  బి.రాహుల్​అన్నారు. మీటింగ్ హాలులో సోమవారం గిరిజన దర్బారు నిర్వహించి ఆదివాసీల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు.  స్కూళ్లు, కాలేజీల్లో సీట్లు కావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకున్నారు. వ్యవసాయ భూముల్లో బోర్లు, కరెంట్, మోటార్లు, తాగునీటి సమస్యలు, స్వయం ఉపాధి పథకాలకు అప్లై చేసుకున్నారు.