పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతిపక్షాల ఆందోళన

పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రతిపక్షాల ఆందోళన

లోక్ సభ, రాజ్యసభ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీలకు ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. వారికి తమ మద్దతు తెలియచేస్తున్నాయి. 20 మంది రాజ్యసభ నుంచి నలుగురు లోక్ సభ నుంచి ఎంపీలు సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే. సస్పెన్షన్ ను రద్దు చేసేంత వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని సభ్యులు స్పష్టం చేశారు. గాంధీ విగ్రహం వద్ద గత రెండు రోజులుగా వారు నిరసన కొనసాగిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వాళ్లు ఆందోళన చేస్తున్నారు.
సభా కార్యకలాపాలను అదేపనిగా అడ్డుకున్నందుకు విపక్షాలకు చెందిన19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్​ విధించిన సంగతి తెలిసిందే.

ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ వారం సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. దీంతో రాజ్యసభలో సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల సంఖ్య 20కి చేరింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 18 నుంచి విపక్షాల ఎంపీలు.. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విపక్ష ఎంపీలు.. కనీస అవసరాలపై జీఎస్టీ విధింపుపై చర్చకు పట్టుబడుతూనే ఉన్నారు. విపక్షాలు చేపడుతున్న ఆందోళన, సస్పెన్షన్ పై లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఎలా స్పందిస్తారో చూడాలి.