చిన్న కారణాలతో మమ్మల్ని తొలగించిన్రు

చిన్న కారణాలతో మమ్మల్ని తొలగించిన్రు
  • గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది
  • మమ్మల్ని మీరే ఆదుకోండి 
  • సీఎం రేవంత్​ఇంటికి సస్పెండెడ్ ఆర్టీసీ ఉద్యోగులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా తాము నష్టపోయామని  ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న కారణాలకే 1,500 మందిని ఉద్యోగాల నుంచి  తీసివేశారని వాపోయారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి పోలీసులు అనుమతి ఇచ్చారు.