Nani: ఆ సినిమా కూడా ఆగిపోయిందా.. అసలు నాని ఎం చేస్తున్నాడు?

Nani: ఆ సినిమా కూడా ఆగిపోయిందా.. అసలు నాని ఎం చేస్తున్నాడు?

అసలు హీరో నానికి ఏమైంది? వరుసగా ఆయన సినిమాలపై న్యూస్ ఎందుకు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బలగం వేణుతో చేస్తున్న ఎల్లమ్మ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు మరో దర్శకుడి సినిమా కూడా అటకెక్కింది అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ సినిమా ఏంటి? ఆ దర్శకుడు ఎవరంటే?

నేచురల్  స్టార్ నాని ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల మునుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తరువాత నాని చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. నిజానికి సరిపోదా శనివారం సినిమా తరువాత ఏకంగా ముగ్గురు దర్శకుల ప్రాజెక్టులు ఒకే చేశారు నాని. 

అందులో బలగం వేణు, సాహూ ఫేమ్ సుజీత్, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల. ఈ ముగ్గురితో సినిమాలు చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నేని. అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. అయితే.. తాజా సమాచారం మేరకు. సుజీత్ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లమ్, బలగం వేణు, శ్రీకాంత్ ఓదెల సినిమాలకు కథా సమస్యళుళ్ వచ్చాయట. అవును.. నాని కోసం బలగం వేణు, శ్రీకాంత్ ఓదెల సిద్ధం చేసిన రెండు కథలో ఇంచుమించు ఒకేలా ఉన్నాయట. దాంతో ఈ రెండు ప్రాజెక్టులను ప్రస్తుతానికి పక్కన పెట్టేశాడట నాని. 

ఇక సుజీత్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు ముందుగా అనుకున్నబడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుందట. ఆ కారణంగా మరోసారి ఈ ప్రాజెక్టుపౌ డిస్కషన్స్ జరుగనున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి సరిపోదా శనివారం సినిమా తరువాత నాని చేయబోయే సినిమాపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదనే చెప్పాలి. చెప్పుకోవడానికి మూడు భారీ సినిమాలుప్పటికీ ఏ సినిమా ముందుగా మొదలవుతుంది అనేది తెలియదు. దాంతో నాని ఫ్యాన్స్ కాస్తా డిజప్పాయింట్ లో ఉన్నారు.