అమెరికాలో పొడవైన పాదచారుల సస్పెన్షన్ బ్రిడ్జి ఇది. టెన్నెసీలోని గాట్లిన్బర్గ్లో కడుతున్నారు. ‘స్కై బ్రిడ్జ్’ అని పిలుస్తున్నారు. గ్రేట్ స్మోకీ మౌంటెయిన్స్‌ను కలుపుతూ 680 అడుగుల పొడవుతో 140 అడుగుల ఎత్తులో కట్టారు. మే 17న ఓపెన్ చేయనున్నారు. మీకు ఎత్తులంటే భయమైతే బ్రిడ్జి మీదకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు కట్టినోళ్లు. ఎందుకంటే.. మధ్యలోకి వెళ్లాక కింద అంతా కనిపించేలా గ్లాస్ ఫ్లోర్‌ను ఏర్పాటు చేశారు. ధైర్యమున్నోళ్లకు మాత్రమేనంటున్నారు దానిని కట్టినోళ్లు. స్కైలిఫ్ట్ పార్క్‌లో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మించారు. చైర్లిఫ్ట్లో క్రాకెట్ మౌంటెయిన్పైకి తీసుకెళతారు. అక్కడి నుంచి బ్రిడ్జిపైకి వెళ్లొచ్చు. పెద్దలైతే సుమారు ₹1000 (15 డాలర్లు) , పిల్లలైతే సుమారు ₹830 (12 డాలర్లు) పెట్టి టికెట్లు కొనుక్కోవాలి. ప్రపంచంలోనే పొడవైన పాదచారుల సస్పెన్షన్ బ్రిడ్జి స్విట్జర్లాండ్‌లో ఉంది. దాని పేరు చార్లీ కువోనెన్ సస్పెన్షన్ బ్రిడ్జ్. 279 అడుగుల ఎత్తులో 1621 అడుగుల పొడవున కట్టారు దాన్ని. 2017లో ఓపెన్ అయింది.
