12మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందే

12మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందే

న్యూఢిల్లీ: 12మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాల్సిందేనన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు పార్లమెంట్ ఉభయ సభలను నడవనివ్వబోమన్నారు. అంతకుముందు ప్రతిపక్ష పార్టీలు సమావేశమై కేంద్రం ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరు కావాలా వద్దా అనే అంశంపై చర్చించాయి. సమావేశానికి హాజరు కావొద్దని నిర్ణయించామన్నారు సంజయ్ రౌత్.