ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజీనామా

ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజీనామా

ఎస్వీబీసీ ఛానెల్ మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడి తన పదవిని కోల్పోయారు వైసీపీ నేత పృథ్వీ. కొద్దిసేపటి క్రితమే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీ వ్యవహారం పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీరియస్ అయ్యారు

ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని , ఎవరో కావాలనే ఇందులో ఇరికించారని పృథ్వీ తనకు చెప్పినట్టు వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. అయితే విజిలెన్స్ విచారణ తరువాత పృథ్వీపై చర్యలుంటాయని అన్నారు.

అయితే పృథ్వీ వ్యవహారంలో సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలతో అసభ్యంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా..టీటీడీ గురించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయాలని పృథ్వీని  జగన్ ఆదేశించినట్లు, సీఎం ఆదేశాలతో  రాజీనామా చేశారు.     

రాజీనామా వ్యవహారంపై పృథ్వీ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది