పేటీఎంకు లాభమొచ్చింది.. జూన్ క్వార్టర్లో రూ.122.5 కోట్లు

పేటీఎంకు లాభమొచ్చింది.. జూన్ క్వార్టర్లో రూ.122.5 కోట్లు

న్యూఢిల్లీ: పేటీఎం బ్రాండ్‌‌‌‌ పేరెంట్​ కంపెనీ ఫిన్‌‌‌‌టెక్ సంస్థ వన్​97 కమ్యూనికేషన్స్, జూన్ 2025తో ముగిసిన క్వార్టర్​లో తొలిసారిగా రూ.122.5 కోట్ల కన్సాలిడేటెడ్​ నికర లాభాన్ని సంపాదించినట్టు కంపెనీ ఒక ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. పేటీఎం ఏడాది క్రితం రూ.840 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల నుంచి దాని కన్సాలిడేటెడ్​ ఆదాయం దాదాపు 28 శాతం పెరిగి రూ.1,917.5 కోట్లకు చేరుకుంది. ఇది జూన్ 2024 క్వార్టర్​లో రూ.1,501.6 కోట్లుగా ఉంది.  వన్​97 కమ్యూనికేషన్స్ షేరు ధర మంగళవారం 3.48 శాతం పెరిగి రూ.1,053కు చేరుకుంది.