డబ్బా ట్రేడింగ్ వద్దు! ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్

డబ్బా ట్రేడింగ్ వద్దు! ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్

న్యూఢిల్లీ: డబ్బా ట్రేడింగ్​ చట్ట విరుద్ధమని, ఇట్లాంటి అక్రమ ట్రేడింగ్ ​సర్వీసుల సంస్థలకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. గత వారం ఒక న్యూస్​పేపర్​లో డబ్బా ట్రేడింగ్​ ప్రకటన రావడంతో సైబర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బా ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్‌కు వెలుపల, అనధికారికంగా జరిగే ఒక రకమైన స్టాక్ ట్రేడింగ్. దీనిని "బకెట్ ట్రేడింగ్" అని కూడా పిలుస్తారు. సాధారణ స్టాక్ మార్కెట్‌లో ఒక ఇన్వెస్టర్ షేర్లను కొనాలన్నా, అమ్మాలన్నా డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. ఈ లావాదేవీలు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల నియంత్రణలో జరుగుతాయి.

డబ్బా ట్రేడింగ్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఇందులో ఎక్స్ఛేంజ్‌లో నిజమైన ట్రేడ్ జరగదు. డబ్బా ఆపరేటర్ తన కస్టమర్ల నుంచి బయ్​ లేదా సెల్​ ఆర్డర్లను తీసుకుని, వాటిని తన వ్యక్తిగత లెడ్జర్‌లో నమోదు చేసుకుంటాడు. స్టాక్ ధర పెరిగితే, కస్టమర్‌కు లాభం ఇస్తాడు.  ధర తగ్గితే కస్టమర్​నష్టపోతాడు. ఇక్కడ లావాదేవీలన్నీ ఆపరేటర్  కస్టమర్ మధ్య మాత్రమే జరుగుతాయి, స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో సంబంధం ఉండదు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు. డబ్బా ఆపరేటర్లు కస్టమర్లను మోసం చేసే అవకాశం చాలా ఎక్కువ.  కస్టమర్‌కు భారీ లాభాలు వస్తే, ఆ ఆపరేటర్ డబ్బు చెల్లించకుండా పారిపోవచ్చు.