కోతుల బెడద నివారించాలని రాష్ట్రపతికి లేఖ

కోతుల బెడద నివారించాలని రాష్ట్రపతికి లేఖ

మహబూబాబాద్, వెలుగు: కోతుల బెడద నివారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందిస్తారు. అందుకు భిన్నంగా మహబూబాబాద్​ జిల్లా గార్లకు చెందిన ఈశ్వరలింగం కోతుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశాడు. కాగా, లేఖ అందినట్లు రాష్ట్రపతి భవనం నుంచి సమాచారం అందడంతో, ఆయన రాసిన లేఖ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.