అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు

అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు

మల్లాపూర్, వెలుగు:- బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్  మండలానికి చెందిన బాలికపై అదే మండలానికి చెందిన మర్రిపల్లి సాయినాథ్(24) అత్యాచారం చేశాడు. 

2021 ఏప్రిల్​ 4న నిందితుడిపై ఎస్సై రవీందర్​ పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.  బాలికకు రూ.2లక్షలు పరిహారం అందించాలని ఆదేశించారు.