మళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని స్వీకరిస్తా: వైసీపీ నేత పృథ్వీ

మళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని స్వీకరిస్తా: వైసీపీ నేత పృథ్వీ

మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ పద్మావతి గెస్ట్ హౌస్ లో తాను మద్యం తాగానని.. తనపై ఆరోపణలు చేశారని అన్నారు. తాను మధ్యం సేవించానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాను మద్యం సేవించ లేదని, అవసరమైతే వైద్యుల పర్యవేక్షణలో టెస్ట్ లు కూడా చేయించుకుంటానని సవాల్ చేశారు.

తన సినీరంగ ప్రవేశంపై వైఎస్ ప్రశంసించారని, అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి అండగా ఉన్నట్లు వైసీపీ నేత పృథ్వీ చెప్పారు. కావాలనే ప్రతిపక్ష నేతలు తనపై దుష్ప్రచారం చేశారన్నారు. తన గురించి వస్తున్న ఆడియో టేపుల వ్యవహారంలో విజిలెన్స్ తో విచారణ చేయించాలని టీటీడీ ఛైర్మన్  వైవీ సుబ్బారెడ్డిని కోరినట్లు తెలిపారు.

విజిలెన్స్ విచారణ జరుగుతుందని, విచారణలో తాను తప్పు చేయలేదని తేలితే మళ్లీ ఎస్వీబీసీ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపడతానని అన్నారు.

రాజధాని వ్యవహారంలో రైతులందర్ని తాను పెయిడ్ ఆర్టిస్ట్ లని అనలేదన్నారు. బినామీ రైతుల్ని మాత్రమే అన్నట్లు చెప్పారు. పోసాని చేసిన విమర్శలపై స్పందించిన పృథ్వీ..తన అన్న అలా ఎందుకు మాట్లాడారో తెలియదన్నారు. పోసాని మంచి స్నేహితుడని, విమర్శలు చేసినా..స్నేహితుడిగానే కొనసాగుతునని పృథ్వీ చెప్పారు.